త్రిత్వము తరువాతి 15వ ఆదివారం - 8th సెప్టెంబర్ , 2024

1 రాజులు 17:8-16; 2 థెస్స 3:6-13; యోహాను 11:1-11

డా. వేథకని వేదనాయగం

1 రాజులు 17:8-16

నేపథ్యం హెబ్రీ లేఖనాల్లో, 1&2 సమూయేలు గ్రంధాలు సమైక్య ఇశ్రాయేలు రాజ్య చరిత్రను గురించిన వర్ణననిస్తాయి. ఆ తర్వాతి రెండు గ్రంథాలైన 1&2 రాజులు గ్రంథాలు వాటి కొనసాగింపుగా ఉంటూ, వాటిలో ప్రవక్తల పాత్ర మరియు వారి గురించి, వారి దైవజ్ఞానాన్ని గురించిన వాటికి ప్రాముఖ్యతనిస్తున్నాయి. ఈ ప్రవక్తలలో, ఇశ్రాయేలు రాజ్య క్లిష్ట రాజకీయ పరిస్థితుల్లో యెహోవా దేవుని చిత్తాన్ని గురించి బలంగా తెలియజేసిన వానిగా ఏలీయా ప్రవక్తను గురించి తెలియజేయబడుతుంది. ఈయన యెహోవా దేవుని చేత యూదా మరియు ఇశ్రాయేలు ప్రాంతాలకు పంపబడిన ప్రముఖ ప్రవక్త. దక్షిణ రాజ్య రాజులు వారి దేవుళ్ళ మీద విశ్వాసముంచటంలో విఫలమవ్వకుండా ఉంటుంటే, ఉత్తర రాజ్య రాజులు యెహోవా దేవునికి విశ్వాసంగా ఉండటంలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో ఏలీయా ప్రవక్త, ఉత్తర రాజ్య రాజైన ఆహాబు మరియు అతని కుటుంబం దగ్గరకు మరియు బయలు దేవుణ్ణి వాన దేవుడిగా పూజిస్తూ ఆరాధిస్తున్న ఇశ్రాయేలు జనాంగం దగ్గరకు పంపబడ్డాడు. ఈ నేపథ్యంలో ఏలీయా ప్రవక్త కొన్ని సంవత్సరాలు వర్షాలు పడకుండా ఉంటాయని ప్రవచించిన ప్రవచనం, ఇశ్రాయేలీయులను తిరిగి నిబంధన సంబంధంలోకి తీసుకురాటానికి, ఆనాడున్న మతాధిపత్యం మీద యెహోవా దేవునికున్న అధికారాన్ని గురించి తెలియజేస్తుంది. బయలు మత - రాజకీయాలను ప్రతిఘటించే దైవజ్ఞాన కథనాల బయలనే దేవుడు భూమిని పండించే భర్తగా, కొన్నిసార్లు సృష్టికర్తయైన దేవునిగా కూడా ఎంచబడుతూ, యెహోవా దేవునికిలాగా తన ప్రజల దగ్గరనుంచి విధేయతను, నమ్మకాన్ని బలవంతంగా కోరాడు. ఈ బయలు ఆరాధనను రాజైన ఆహాబు తన రాజకీయ అవసరాల కోసం సమరయలో అనుమతించాడు. రాజకీయ సామ్రాజ్య మరియు మత ఆశయాల కోసం మత నియమాలను ఉల్లంఘించడమనేది మత సంక్షోభానికి కారణమై ఏలీయా ప్రవక్త నిరసనకు దారితీసింది. యెహోవా మరియు బయలు అనేవి సామాజిక విధానాలకు ప్రతినిధులుగా ఉండటం వల్ల, ఆహాబు మరియు ఏలీయాల మధ్య ఘర్షణ రెండు సిద్ధాంతాలైన యెహోవా - బయలు సిద్ధాంతాల మధ్య పోరాటంగా నిలిచింది. ఇంకో రకంగా చెప్పాలంటే, రాచరిక వ్యవస్థ లేకముందు, సమాన సామాజిక విలువలతో యెహోవా దేవుడు భూమితో మరియు ప్రజలతో సమాన సంబంధ బాంధవ్యాలు కలిగున్న యెహోవా దేవుని సిద్ధాంతానికి మరియు సామాజిక నిచ్చెన విధానాన్ని చట్టబద్ధం చేసిన దైవాల సార్వభౌమత్వాన్ని పెంచి పోషించే బయలు మత సిద్ధాంతానికి మధ్య జరిగిన పోరాటమని అనుకోవచ్చు. కాబట్టి ఇక్కడ, ఇశ్రాయేలీయులు ఒక సమాజంగా తమ దేవునియెడల చూపించే విశ్వాస్యత మత అవసరతకన్నా మించిందిగా చూడబడుతుంది. ఈ నేపథ్యంలో, యెహోవా దేవుడు జీవాన్ని ధృవీకరించటానికి వాడుకున్న బలహీనురాలైన విధవరాలు మరియు హీనంగా చూడబడే జీవియైన కాకి ద్వారా ప్రవక్త బలంగా బయలు ఆరాధికులను ఎదుర్కొన్న విధానం, సామాజిక జీవ సంపూర్ణతను బలంగా కోరుతుంది. ఈ విధంగా ఇశ్రాయేలు సమాజం, తమ మత రాజకీయ విధానాల్లోకి బయలు మత - రాజకీయ విధానాల్ని చేర్చుకోటం మరియు ఆహాబు అనైతిక సామాజిక - ఆర్థిక విధానాలు, ఆకలిగొన్న మరియు బీద విధవరాల పరిస్థితులతో వ్యక్తపర్చబడి, చివరకు నాబోతును హతమార్చటం (1రాజులు 21) ద్వారా ఏలీయా ప్రవక్త వారి విధానాల్ని సవాల్ చేస్తున్నాడు. ఉదాహరణకు, భూమికి సంబంధించిన విధివిధానాలు మరియు యజమానత్వం గురించిన చట్టపరమైన విషయాల మధ్య ఘర్షణ (21అధ్యా) అస్సీరియాలాంటి చోట్ల సర్వసాధారణం, కానీ, ఇశ్రాయేలులో వీల్లేదు. ఏలీయా తర్వాతొచ్చిన ఎలీషా కూడా సాంప్రదాయ విలువలను గురించి గట్టిగా మాట్లాడాడు, కానీ అవి కూడా రాజ్య సామాజిక - ఆర్థిక విధానాల మధ్య సవాళ్ళెదుర్కొన్నాయి (1 రాజులు 16; 2 రాజులు 13). ఇక్కడ, బయలు దేవుడు వర్ష మరియు సంపదల దేవుడిగా ఉన్న నేపథ్యంలో వచ్చిన కరువనేది గమనించవలసిన ఇంకొక అంశం. ఈ అంశాన్ని, యెహోవా దేవుడు బయలు దేవుడు వర్ష దేవుడిగా గుర్తింపబడిన ప్రధాన గుర్తింపును అణచేయటానికి వాడుకున్నాడు. ముఖ్యాంశాలు ప్రత్యామ్నాయ అధికార నమూనాలను కలుగజేసి (ఉదా: శక్తిమంతుడైన యెహోవా దేవుని సేవకుని జీవితాన్ని నిలబెట్టేవారిగా సారెపతు విధవరాలు మరియు కాకిని ఉంచటం; నిస్సహాయుడైన ఆహాబు రాజు యొక్క పరిస్థితి; ఏలీయా మరియు బయలు దేవుని 400 పైగా ఉన్న ప్రవక్తల మధ్య ప్రవచనాత్మకంగా ఏలీయా ద్వారా బయలుపర్చబడిన బలం) సామాజిక - ఆర్థిక మరియు రాజకీయ విధానాలు లొంగదీసుకునేయిగా మరియు చావుకు కారణమయ్యేయిగా ఉండే ప్రతి చోట దేవుని అధికార/బలాలు బలహీనుల ద్వారా ప్రదర్శింపబడుతూ ఉండాలి (17,18 ఆధ్యా).

2 థెస్స 3:6-13

నేపథ్యం థెస్సలోనియులకు వ్రాసిన రెండవ పత్రిక నేపథ్యం గురించిన చర్చ మనల్ని దాని రచయిత గురించి మాట్లాడుకునే దిశగా నడిపిస్తుంది. ఇది పౌలు ద్వారా వ్రాయబడిందని అనుకుంటున్నా, ఈ పత్రికలో కనిపించే ఆధారాలు అతను కాకుండా అతనితో ఉన్న వారెవరో ఒకరు, పౌలు క్రీస్తు రెండవ రాకడ గురించి ఏం చెప్తాడో కనుగొనాలని ఆశించిన వాడెవడో వ్రాసుండొచ్చని చెప్పేటట్లు చేస్తున్నాయి. ఎందుకంటే, మొదటి పత్రికలోనే క్రీస్తు రెండవ రాకడ గురించి పాఠకుల మధ్య అనేక సమస్యలు, వాదనలు జరిగాయని ఈ పత్రికలో ఆరుసార్లు వ్రాయబడింది. రెండవ రాకడ త్వరలోనే రాబోతుందని, ఒకవైపు "ఇప్పటికే వచ్చేసిందని", ఇంకోవైపు ఇంకా "రావాల్సివుందని" అనుకుంటూ ఉండటంతో సమాజం రెండుగా చీలింది. ఈ గందరగోళాన్ని తీసెయ్యటానికి మరియు ఈ విశ్వాస నిశ్చయతలో స్పష్టంగా ఉండటానికి వారికి ఈ రెండవ పత్రిక వ్రాయబడింది. రెండవ రాకడ ఇప్పటికే జరిగిపోయింది అనుకునే గుంపు సోమరులయ్యారు, దానికి ఫలితంగా సమాజం అస్తవ్యస్తతకు, అనైతికతకు గురై, బంధాల మధ్య సమస్యలు తలెత్తాయి (6-13వ). క్రీస్తును గురించి సమాజ భావన పునరుత్థానం తర్వాతి క్రైస్తవ సమాజాలు వారి దైవజ్ఞానాన్ని యేసు చుట్టూ క్రీస్తు పరిభాషలో, వారి సామాజిక జీవితాలను నిలబెట్టుకోటం కోసం సామాజికంగా తలెత్తిన ప్రశ్నలకు స్పందనగా వ్యక్తీకరించుకునే అత్యవసరతలో ఏర్పర్చుకున్నారు. క్రీస్తానుగుణమైన వ్యక్తీకరణనేది, అప్పుడే ఏర్పడిన సంఘం చుట్టూ తలెత్తిన ప్రశ్నలకు, ప్రభువు దినాన్ని గురించిన ఊహలకు అత్యంత అవసరమైన స్పందనగా నిలిచింది. ఏదేమైనా, ఈ ఆవశ్యకత, సామాజిక అవసరతలకు అనుగుణమైన దైవజ్ఞాన ఆలోచనలతో పరిష్కరించబడలేదు కాబట్టి, ఇది సమాజ అనిశ్చితకు దారితీసింది. ఈ నేపథ్యంలో, రచయిత సమాజాన్ని, సమాజ విలువలు మరియు క్రమశిక్షణలతో ఎదుర్కొన్నాడు. ఆయన దైవజ్ఞాన వ్యక్తీకరణ సమాజ క్రమశిక్షణ మరియు సంబంధాల వైపు కేంద్రీకృతమయ్యేదిగా ఉండాలని ధ్రువీకరించాడు. ముఖ్యాంశాలు ఈ వాఖ్యభాగం విశ్వాసానికి, కృషికి మధ్యున్న సంబంధాన్ని ఖచ్చితంగా గమనించాలని; మరియు చురుకుగా ఉండటం/కృషి చేస్తూ ఉండటమనేది (సోమరితనంగా లేకుండా) జీవానికి ఉదాహరణగా అభివర్ణించబడుతుందని తెలియజేస్తుంది. అట్లాగే సమాజంలో వ్యక్తిగతమైన భాధ్యత కలిగుండటమనేది క్రీస్తులో విశ్వాసంగా ఉండటానికి మూలంగా ఉన్నదని రచయిత తెలియజేస్తున్నాడు.

యోహాను 11:1-11

నేపథ్యం చనిపోయిన లాజరును తిరిగి లేపటమనే కథనం (1-11) రక్షకుడైన యేసయ్య మరణం నుంచి తిరిగి లేపే శక్తి గురించిన అత్యున్నత స్థితిని గురించి తెలియజేస్తుంది. ఏదేమైనా, ఈ కథనం ఈ యోహాను సువార్తలో యేసయ్య పునరుత్థానం గురించి తెలియజేసే దానికొక ముందస్తు సూచన. సరిగ్గా దీనికి ముందున్న నేపథ్యం యూదుల అపనమ్మకం (10:22-42). అట్లాంటి పరిస్థితిలో, ఇంకో విధంగా చెప్పాలంటే, యేసయ్య తన ఈ లోక జీవిత ప్రయాణ అంతిమ సమయంలో ఉండి, ఇంక చంపబడటానికి యెరూషలేములోకి ప్రవేశించబోతున్నాడు కాబట్టి, ఇది రక్షకుని గురించి మరియు యేసయ్య ఆధిపత్యాన్ని గురించి ఖచ్చితంగా వ్యక్తపర్చబడాల్సిన సమయంగా ఉంది. నమ్మడానికి దారితీసిన అపనమ్మకం నిరాకరణను గురించిన వేదాంతం సువార్తలలో ప్రాముఖ్యమైన దైవజ్ఞానాంశం. ఈ లోతైన దైవజ్ఞానాంశం యూదేతరులకు రక్షకుడైన యేసయ్యను అన్వేషించడానికి ఒక అవకాశాన్ని కల్పించింది. ఈ కథనంలో, చెప్పాలంటే యేసయ్యో లేక లాజరో కేంద్రం కాదు కానీ, రక్షకునిగా యేసయ్య యొక్క గుర్తింపు మరియు అధికారమనేదే కేంద్రం. అంతేకాకుండా ఈ కథనం, ఆధిక్యతకలవారు వారి ఆధిక్యతలను "అన్యుల" హక్కులు మరియు జీవ ధ్రువీకరణ కోసం విడనాడాలనే రక్షణలోని న్యాయపరమైన అంశాన్ని బలపరుస్తుంది. అదే విధంగా, యూదుల అపనమ్మకమిక్కడ వారు యేసయ్య రక్షకునిగా కనపర్చుకోవాలని బలవంతం చేసిన విధానం, అటు యూదులు మరియు "అన్యులు" యేసయ్య రక్షణ కార్యంలో ఉన్నారని నమ్మటానికి దారి తీసే విధంగా మారింది ప్రశ్నలు ప్రస్తుత నవ - సామ్రాజ్యవాద నేపథ్యంలో దాన్ని ఎదుర్కోటానికి సంఘం సమాజాలకు ఎట్లాంటి ప్రత్యామ్నాయ విశ్వాస నమూనాలను అందించాలి? ఆధిపత్య భావజాలాలు మరియు జీవిత విధానాలు ఎట్లా వేరే సాంప్రదాయ సంస్కృతులను మన వాటిల్లో ఇముడ్చుకోటాన్ని సర్వసాధారణ విధానంగా చేస్తాయి? రక్షణలోని న్యాయపరమైన కోణాన్ని కొలుస్తూ, అందరికీ రక్షణ అందడానికి ఏ విధమైన పరిచర్య నమూనాలను పాటించాలి?

ప్రార్ధన

జీవ, నిరీక్షణలకు ఆధారభుతుడైన దేవా, వేరే సాంప్రదాయ సంస్కృతులనుంచి చేర్చుకొని, వాటిద్వారా స్థాపించబడ్డ బానిస భావజాలాలు మరియు విశ్వాసారోపణ స్థాపనలను అర్థంచేసుకుని మా మార్గాలను మరియు జీవ ప్రవృత్తిని సరిచేసుకొని నడుచుకోటానికి సహాయము దయచేయుమని ప్రార్థిస్తున్నాము. మా విశ్వాసాన్ని సమాజాల అభ్యున్నతి కోసం మరియు అవసరతలోనున్న వారి జీవ ధ్రువీకరణ కోసం వ్యక్తీకరించబడేటట్లు ఉండులాగున సహాయము చేయుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమెన్.

వ్యాసకర్త

డా. వేథకని వేదనాయగం CSI సంఘంలోని మదురై - రామ్నాడ్ డియోసిస్కు చెందిన వారు. వీరు ప్రస్తుతం చెన్నైలోని గురుకుల్ లూథరన్ థియోలాజికల్ కాలేజీ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లోని క్రొత్త నిబంధన విభాగంలో అసిస్టెంట్ ప్రోఫెసర్గా సేవలందిస్తున్నారు.

అనువాదం: రెవ. సుమంత్ సుధ నెమలికంటి.


సెర్మన్ లాబ్ నేడు మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని నాలుగోవ సంవత్సరంలోకి అడుగుపెట్టిందన్న విషయాన్ని మీతో పంచుకోటానికి సంతోషిస్తున్నాము. ఈ వనరు కేవలం ఆంధ్ర సౌవార్తిక లూథరన్ సంఘం (AELC) కి సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల్లోని సంఘాలకే కాక భారతదేశం మరియు ఇతర దేశాల్లోని ప్రజలకు, దాదాపు 500 మందికి పైగా ప్రతి వారం, ఆదివారానికి సంబంధించిన వాఖ్యభాగాల మీద వ్యాఖ్యానాల్ని అందించటానికి సెర్మన్ లాబ్ బృందాన్ని ప్రేరేపించి బలపరచిన దేవునికి వందనాలు. ఈ సమయంలో సెర్మన్ లాబ్ ఇంకెక్కువ ఉపయోగకరంగా మరియు సమయోచితంగా ఉండటానికి తగిన మార్పులు చేర్పులు చెయ్యాలని ఆశిస్తున్నాము. అందుకుగాను మీ ముందు ఒక అభ్యర్ధన పెడుతున్నాము. దయచేసి కొన్ని నిమిషాలు సమయం కేటాయించి మీ అమూల్యమైన అభప్రాయాలను ఈ క్రింది ప్రశ్నలకు అనుగుణంగా అందించ మనవి.చ మనవి.

అందుకుగాను ఈ లింకులోని పత్రాన్ని పూర్తిచేయవలసిందిగా మనవి