Sermon Lab is an exploratory space for preachers. It offers new meanings and interpretations of biblical texts to assist them as they prepare their sermons to inspire more faithful and creative forms of discipleship in today’s world.
It offers exegetical resources, interpretive tools and insights on the three Sunday texts as per the lectionary of the Andhra Evangelical Lutheran Church.
These commentaries are offered by biblical scholars and theologians from many parts of India and the world who are recognized for their biblical scholarship, progressive thinking, and most of all, for their passion for preaching. Insights on the context of the texts, intent of the authors, key theological themes, and prayers are the key features of these weekly commentaries.
With these resources, the preachers have the freedom and possibility to prepare their sermons as per the needs of their congregations and in response to the demands of the time. The Resources Page offers the possibility to read commentaries on the texts from Advent 2020 onwards and also to offer suggestions.
Sermon Lab believes that a sound knowledge of the scriptures and a critical awareness of the world are crucial for the written Word to come alive as the liberating and transforming Word of God. Sermon Lab affirms that faith in God through Christ is essentially transformative. (Matt.5:13-16)
It heals and restores, and confronts and transforms people, relationships and communities. It creates and nurtures conditions for a culture of life that God intends for all. In that spirit of witnessing to the coming reign of God, the content of these resources will be respectful of all genders, identities and circumstances in life, and of the faith traditions of our neighbours.
Sermon Lab is a voluntary initiative of an informal collective of preachers, teachers, and biblical and theological scholars committed to the vocation of facilitating progressive change in the AELC. The collective is grateful to the writers from many church traditions and places in the world for their partnership in this ministry of equipping people in AELC to join God’s mission of life with justice and dignity for all.
Suggestions, Comments, Questions and Requests for additional resources are welcome.
సెర్మన్ లాబ్ అనే ఈ స్థలం బైబిల్ వాఖ్యభాగాల్ని సరికొత్త విధానాల్లో తెలుసుకోటానికి చూడగలిగిన ఒక ప్రదేశం. దేవుని ప్రజల్ని నేటి ప్రపంచంలో వారి వారి విశ్వాసాల్లో సృజనాత్మకంగా మరియు నమ్మకంగా ఉండేటట్లు సిద్ధపర్చటమనేది దీని ముఖ్యోద్దేశ్యం.
ఇది, ఆంధ్ర సౌవార్తిక లూథరన్ సంఘలోవున్న వాఖ్యభోధకులకి ప్రతి ఆదివారం ఇవ్వబడిన మూడు వాక్యభాగాలకు సంబంధించిన వివరణలు, విశ్లేషణలు మరియు అంతరార్ధాల్ని వ్యాఖ్యానాల రూపంలో అందిస్తుంటుంది.
ఇవి, ప్రపంచ దేశాలు మరియు భారతదేశంలోని అనేక ప్రాంతాలనుంచి వారి వారి పాండిత్యానికి, వాఖ్యభాగల్ని సృజనాత్మకంగా అర్థంచేసుకునే విధానానికి, అన్నిటికన్నా మించి, బోధన పరిచర్యయెడల వారికున్న అభిరుచినిబట్టి గుర్తింపుపొందిన వారి ద్వారా అందించబడుతున్నాయి.
ఈ వ్యాఖ్యానాలు, వాఖ్యభాగాల యొక్క సందర్భాల్ని, రచయితల ఉద్దేశ్యాల్ని, వేదాంతపరమైన ఆలోచనల్ని అందిస్తూ, ఆత్మ ప్రేరేపణ ద్వారా విశ్వాసుల్ని సున్నితంగా ఆలోచించి ప్రతిస్పందించేటట్లు చెయ్యటానికి భోధకులకు సరిక్రొత్త మార్గాల్ని సూచిస్తాయి. అంతేకాకుండా - వివిధ సంఘటనలకి పోకడలకి సంబంధించిన వార్తావిశేషాల్ని, ఆరాధన వనరుల్ని, ఆశక్తికరమైన చారిత్రక సత్యాల్ని, బొమ్మల్ని, చిత్రపటాల్ని మరియు క్రైస్తవులు, సంఘాలు మారటానికి, మారేటట్లు ప్రభావితం చెయ్యటానికి స్ఫూర్తినిచ్చే ప్రతీదాన్ని ఇది అందిస్తుంది.
ఇది, సువార్త సత్యమనేది ప్రపంచ వాస్తవాలని గురించి మాట్లాడే విధంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించబడింది.
ఈ విధమైన సృజనాత్మక మరియు క్లిష్టమైన పరిశోధన ద్వారా వ్రాయబడిన వాక్యం, విమోచించి మార్పు కలిగించే సజీవమైన దేవుని వాఖ్యంగా అందించబడుతుంది. క్రీస్తు ద్వారా దేవునియందలి విశ్వాసం ప్రాముఖ్యంగా పరివర్తన కలిగించేదనే విషయాన్ని సెర్మన్ లాబ్ ధృవీకరిస్తుంది (మత్తయి 5:13-16).
దేవుని ఉద్దేశ్య ప్రకారం అందరి జీవితాలు బాగుండటానికి అవసరమైన పరిస్థితుల్ని ఇది సృష్టించి అభివృద్ధి చేస్తుంది. రాబోయే దేవుని పాలనకు సాక్షులుగా నిలవాలనే స్పూర్తితో, ఇందులో అందించే వనరులన్ని కూడా మన జీవన విధానములోని ప్రతి పరిస్థితిని, గుర్తింపుని, లింగభేదాల్ని, ఇరుగుపొరుగునున్న వారి విశ్వాస సాంప్రదాయాల్ని గౌరవించే విధంగా అందించబడుతున్నాయి.
సెర్మన్ లాబ్ అనేది ఆంధ్ర సౌవార్తిక లూథరన్ సంఘంలో ప్రగతిశీలక మార్పు ఒక పద్ధతి ప్రకారం తీసుకురావాలనే ఉద్దేశ్యానికి కట్టుబడి అనధికారికంగా సమిష్టిగా చేరివచ్చిన వివిధ భోధకులు, అధ్యాపకులు, మరియు వేదవాఖ్య పండితుల సమాహారమైయున్నది.
ఆంధ్ర సౌవార్తిక లూథరన్ సంఘ సభ్యులు, అందరికి న్యాయం గౌరవం అందించాలనే జీవముగల దేవుని పరిచర్యలో పాలిబాగస్థులు కావాలనే ఉద్దేశ్యంతో ప్రపంచ వ్యాప్తంగావున్న వివిధ సంఘ సంప్రదాయాలనుంచి ఈ పరిచర్యలో భాగమై సహకరించిన/సహకరిస్తున్న ప్రతి రచయితకు ఈ సమైక్య ఎంతగానో కృతజ్ఞత కలిగివుంటుంద ఇంకా మీరు ప్రశ్నలు అడగటానికి, అనుమానాలు స్పష్టం చేసుకోటానికి, ఇంకేమైనా సహాయం పొందటానికిగానీ లేక మాట్లాడటానికిగానీ మీకిక్కడ అవకాశమివ్వి బడుతుంది.
దయచేసి మీ ప్రశ్నల్ని, వ్యాఖ్యల్ని (సలహాలు-సూచనలు) మమ్మల్ని సంప్రదించండి అనేదగ్గర తెలియజేయగలరు: